Chirumarthi Lingaiah | నల్లగొండ జిల్లాకు నాలుగు సార్లు వచ్చి పోయినవ్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎంతవరకు పూర్తి చేయగలిగినవ్.. అందులో ఎనిమిది మంది చనిపోతే.. వారి మృతదేహాలుంటే బయటకు తీయలేకపోయినవ్.. చేతికాని ప్రభుత్వం నీది కాదా..? అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు.
చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ.. నా సొంత గ్రామం బ్రాహ్మణ వల్లెంలలోని ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ఆశీస్సులతో ట్రయల్ రన్ చేసి పెడితే దానికింకా 100 కోట్ల రూపాయల ఫండ్ కావాలి.. వచ్చి ప్రారంభించి పోయినవ్.. ఇప్పటికీ రూపాయి ఇయ్యలేదు.. జిల్లాకొస్తుంటే సిగ్గనిపిస్తలేదా.. అని మండిపడ్డారు. రేవంత్ ప్రసంగిస్తుండగానే జనాలు సభ నుంచి వెళ్లిపోయారు. నీ సొల్లు మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
ఇంకా తొక్కుతా తొక్కుతా అంటే ప్రజలు నిన్ను తొక్కే సమయం దగ్గర పడ్డది. వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా చేసినా అంటున్నవ్.. రైతు బంధు ఇచ్చినవా.. రైతు భరోసా ఇచ్చినవా..? 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నవా..? ఇవాళ మార్కెట్లో ఎరువులు దొరుకుతున్నయా..? యాప్ అన్నవ్.. దుకాణంలో ఎరువులు లేవు. దుకాణంలో ఎరువులు లేనప్పుడు యాప్ ఏం పనిచేస్తదని చిరుమర్తి లింగయ్య అడిగారు. పండించిన పంటలను కొనుగోలు చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు కదా..దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తే ఒక్కొక్క మార్కెటింగ్ సెంటర్లో నీ కాంగ్రెస్ కార్యకర్తలు రక్తం తాగి రూ.40-50 లక్షలు దోపిడీ చేసిర్రని ఆరోపించారు. దానిపై నిఘా ఉందా.. నీ ప్రభుత్వానికి అని చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు.
రేవంత్ నల్లగొండ జిల్లాకు నాలుగు సార్లు వచ్చినా.. నిధులు ఇచ్చింది మాత్రం సున్నా!
నల్లగొండకు ఏమీ చేయకుండా జిల్లాకు రావడానికి రేవంత్‌కు సిగ్గుండాలి.
రేవంత్ ప్రసంగిస్తుండగానే జనాలు సభ నుంచి వెళ్లిపోయారు.
నీ సొల్లు మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు.తొక్కుతా తొక్కుతా… pic.twitter.com/eLHGpvtTu9
— BRS Party (@BRSparty) June 29, 2026