Delivery | దేవరకొండ రూరల్, అక్టోబర్ 29 : జట్టి దేవి వయసు 21 సంవత్సరాలు.. దేవరకొండ మండలం మడమడక గ్రామం. జట్టి దేవికి పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన చింతపల్లి 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే క్రమంలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు మైనంపల్లి వాగు ఉప్పొంగి రాకపోకలు బంద్ అయ్యాయి.
ఈ పరిస్థితుల్లో చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు బాధిత మహిళను స్టెచర్ మీద తీసుకొని వాగు దాటించారు. ఆ తర్వాత వారంతా ఆ మహిళను క్షేమంగా దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కుటుంబ సభ్యులు, స్థానికులు 108 సిబ్బందిని అభినందించారు.
ఓ వైపు వర్షాలతో వరదలు పోటెత్తుతున్నా అసలు భయపడకుండా నల్లగొండ జిల్లా చింతపల్లి అంబులెన్స్ సిబ్బంది ధైర్య సాహసాలను ప్రదర్శించి.. సేవ చేయడంలో వీరికి ఎవరు సాటి లేరని మరొకసారి నిరూపించుకున్నారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల