కట్టంగూర్, మే 09 : బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఊరు బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో గుణాత్మక విద్యను అందించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
జూన్ నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి భోదనలు మరింత మెరుగుపర్చడం జరగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.