Markandeya Swamy Temple | చండూరు, మార్చ్ 03 : చండూరులోని మార్కండేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 4 నుండి 9 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగనుంది.
స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలను ఉదయం 50 జతల ఎద్దుల శకటం(ఎడ్ల బండి) మీద అమర్చిన మగ్గంపైన తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా చండూరు పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. ఈ నెల 6న గాయత్రి యజ్ఞం, 7న విమాన రథోత్సవం, 8న అగ్నిగుండాలు, 9న శ్రీ భూ,నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ఉత్సవాలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని దేవాలయ చైర్మన్ రావిరాల నగేష్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు