చందంపేట, సెప్టెంబర్ 13 : యూరియా లభించక గత వారం రోజులుగా చందంపేట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పోలేపల్లి స్టేజి వద్ద చిట్యాల సహకార సొసైటీకి 400 బస్తాల యూరియా రావడంతో శనివారం రైతులు భారీగా వచ్చారు. పోలేపల్లి, ముప్పునూతల, గుంటుపల్లి, మూడుదండ్ల, గజిల్లాపురం, కట్రావతండా, రేకులగడ్డ, చిత్రియాల, పెద్ద మూల గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వరుస క్రమంలో పంపిణీతో యూరియా లభించక చాలామంది రైతులు నిరాశతో వెనుతిరిగారు. పోలీస్ బందోబస్త్ మధ్య ఒక్కో రైతుకు ఒకటి లేదా రెండు చొప్పున బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.