చండూర్, ఏప్రిల్ 16 : నల్లగొండ జిల్లా చండూర్ మండలం కస్తాల, చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట), గుండ్రపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం వీటిని కస్తాల గ్రామంలో కోడి సుష్మా-వెంకన్న (DCCB డైరెక్టర్,FSCS చైర్మన్), గుండ్రపల్లి గ్రామంలో ఏఓ కుమారి చంద్రిక ప్రారంభించారు. బంగారిగడ్డ, పుల్లెంల, కొండాపురం ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో రైతన్నలకు చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన TR ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్రామిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. భవిష్యత్‌లోనూ రైతుల కోసం మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాక్షించారు.
ఫౌండేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తాను రైతు బిడ్డనేనని తెలిపారు. ఎండలో రైతులు పడే బాధలు తనకు తెలుసు అన్నారు. రైతులకు చల్లని త్రాగునీరు అందించడం చాలా అవసరం. ముఖ్యంగా వారు చల్లని నీరు త్రాగడం వల్ల వడదెబ్బకు గురికాకుండా ఉంటారన్నారు. రైతులందరూ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న FSCS వైస్ చైర్మన్ శ్రీనివాస్ ,డైరెక్టర్ కట్ట భిక్షం ,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్వాయి అమరేందర్ రెడ్డి, లక్ష్మీ, బూతరాజు ఫణి, ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి వెంకట్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, నకిరేకంటి లింగస్వామి గౌడ్, బూతరాజు శ్రీహరి, ఇరిగి రామకృష్ణ, రాజు, రఘు, సైదులు, రవి, దిలీప్, నర్సింహా, రైతులు పాల్గొన్నారు.