పాలకవీడు,(నేరేడుచర్ల), ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ నైతిక విజయం సాధించిందని నేరేడుచర్ల ప్రజలు అంటున్నారు. 15 వార్డులకు బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ బలపర్చిన జనసేన 1 స్థానాల్లో విజయం సాధించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి 15 వార్డులను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.
ప్రజలు బీఆర్ఎస్కు మెరుగైన స్థానాలు అందించడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఇన్చార్జి దొండపాటి అప్పిరెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. తిరుమలగిరి, నేరెడుచర్లలో బీఆర్ఎస్ అత్యధిక వార్డులను సాధించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ డబ్బు వెదజల్లినా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును ఆపలేకపోయిందని పేర్కొంటున్నారు.