కోదాడ, ఫిబ్రవరి 09 : ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక డబ్బు, బెదిరింపులతో అధికార కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని, అయినా కోదాడలో గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని 24, 25, 26, 32వ వార్డుల్లో ఓటర్లను కలుస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 26వ వార్డులో ఓ బస్టాండ్ బాస్ అర్థరాత్రి తమ పార్టీ అభ్యర్థిని తప్ప తాగి కుక్కడపు సువర్ణాదేవి వెంకటేశ్వర్లు బెదిరించాడని, ప్రచారం చేయకుండా ఇక్కడి నుండి వెళ్లిపోవాలని బెదిరించాడన్నారు. అలాగే 25వ వార్డులో చింతల నాగేశ్వరరావుపై కూడా ఒత్తిడి తెచ్చారని ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరని, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి బాధ్యులైన వారు కూడా హుందాగా వ్యవహరించకుండా తమ స్థాయిని తగ్గించుకుని తమ పార్టీ సభ్యులను ఉపసంహరించుకునే విధంగా ప్రవర్తించిన తీరును ఆయన దుయ్యబట్టారు.

కోదాడలో బీఆర్ఎస్దే విజయం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
14 సంవత్సరాలు అలుపెరగక పోరాటం చేసి సబ్బండ వర్గాలను ఐక్యం చేసిన కేసీఆర్ ఇలాంటి ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఆయన సైన్యమైన తమకు గుండె నిండా ధైర్యం ఉందని, ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టడం తెలుసునన్నారు. ఆయా వార్డుల్లో వీధి వీధి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించిందన్నారు. గులాబీ చీరలు ధరించిన మహిళలు, డప్పుమోతలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, సీనియర్ నాయకులు పైడిమరి సత్యబాబు పాల్గొన్నారు.

కోదాడలో బీఆర్ఎస్దే విజయం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడలో బీఆర్ఎస్దే విజయం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్