అనంతగిరి, డిసెంబర్ 31 : ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికలతో తేటతెల్లమైందని పార్టీ అనంతగిరి మండల నాయకుడు కాకాని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని వాయిలసింగారంలో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన మండలంలోని సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియాను అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అదేవిధంగా రుణమాఫీ పూర్తి చేయడంలోనూ, రైతులకు బోనస్ అందజేయడంలోనూ వైఫల్యం చెందిందన్నారు. యాసంగి పంటకు సరైన సమయంలో యూరియాను అందించి రైతులను ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు.