అర్వపల్లి, సెప్టెంబర్ 20 : అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఎండలో క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాలతో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం తాగునీరు అందించి రైతులకు బాసటగా నిలిచారు. దీంతో యూరియా కోసం క్యూ లైన్లో నిలిచిన ప్రతి రైతు కేసీఆర్ను తలచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొరిశెట్టి ఉపేందర్, రామలింగయ్య, గంగయ్య, యుగేందర్, సైదులు, రామ్ కోటి, మాజీ ఎంపిటిసి రాచకొండ గీతా సురేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టెల మల్లేశ్, సంపతి కిరణ్, ఎల్లం రాజు, రవీందర్, లింగరాజు పాల్గొన్నారు.