తుంగతుర్తి, ఏప్రిల్ 06 : ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తుగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక రైతులు నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే మందుల శామ్యూల్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ , గుండగాని దుర్గయ్య , గాజుల యాదగిరి, సర్పంచ్లు మనోజ్, ఎల్లయ్య, కరుణాకర్, మాజీ ఎంపీటీసీ నరేష్ నాయక్, మాజీ సర్పంచ్ విరోజీ నాయక్, తడకమళ్ల రవి కుమార్, నాగమల్లు, మహేందర్, భాస్కర్, సైదులు, క్రాంతి, జాని, ధర్మా నాయక్ ,తునికిలక్ష్మి, భిక్షం, సూరయ్య, వీరన్న, సాయికిరణ్ మల్లికార్జున్ పాల్గొన్నారు.