చందంపేట, మే 22 : రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు శుక్రవారం చందంపేట మండలం పోలేపల్లి, గుంటిపలీ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తెచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొంటూ రాస్తారోకో నిర్యహించారు. దీంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, లోక్య నాయక్, శివ, శ్రీశైలం, మెహన్ కృష్ణ, రామకృష్ణ, సైదులు, గోపాల్, బలవర్డ్ రాజ్, కొండల్ రెడ్డి, కళ్యాణ్ నాయక్, శివాజీ సత్యనారాయణ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ధర్నా