జెరూసలేం: ఇరాన్ అత్యున్నత నేత మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను హుటాహుటిన దవాఖానకు తరలించారని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. చానల్ 14 (సీ14), జెరూసలేం పోస్ట్ కథనాల ప్రకారం ఖమేనీ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల ముందుకు రాలేదు. లిఖితపూర్వక ప్రకటనలతోనే పాలనను సాగిస్తున్నారు. తన తండ్రి నివాసంపై జరిగిన దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటూ రహస్య నెట్‌వర్క్‌తో అధికారులతో మాట్లాడుతూ పాలన నడుపుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.