అర్వపల్లి, ఏప్రిల్ 21 : ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు విద్యార్థులు, యువత, రైతులు, కేసీఆర్ సైనికులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని రామన్నగూడెంలో గల ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, మన్నె లక్ష్మీ నరసయ్య యాదవ్, మిర్యాల వెంకన్న, గోసుల విజయ్ కుమార్, కట్టెల మల్లేశ్, మురళి, మల్లయ్య, ఎల్లంరాజు, సంపతి కిరణ్, గోపాల్, రామలింగయ్య, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు