తుంగతుర్తి, మార్చి 26 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీకీ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, మహిళలకు నెలకు రూ.2,500, రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, దొంగరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సరిత, వార్డు సభ్యులు, శ్రీనివాస్, మట్టపెళ్లి వెంకట్, పోతరాజు ఇసాకర్, మిట్టగాడుపుల సతీష్, బెడద రాములు, మాజీ సర్పంచ్ సోమశేఖర్, సైదులు, సరిత, బింగి వెంకన్న, మహేష్ పాల్గొన్నారు.