కోదాడ, జనవరి 20 : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయ దుందుభి మోగిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం, తమ్మర కొమరబండ వార్డుల్లో ఆయన పర్యటించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ అని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులతో సర్వోతోముఖాభివృద్ధి చెందిందన్నారు.
కాగా రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రతి వార్డులోనూ బీఆర్ఎస్ శ్రేణులు నూతన ఉత్సాహంతో ఉన్నారని, 35 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకులు పైడిమరి సత్తిబాబు, మామిడి రామారావు, అనంతు, కర్ల సుందర్ బాబు, అలవాల వెంకట్, వీరబాబు, కృష్ణయ్య, శ్రీధర్, ఇమ్రాన్ ఖాన్, గోపి, రాజేశ్, కార్తీక్ పాల్గొన్నారు.