సూర్యాపేట, నవంబర్ 13 : హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించి మాలధారులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 41 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తున్న స్వాములకు కఠిన నియమాల్లో భిక్షకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు. అన్నదానం మహాదానం కనుక ఈ కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల నుండి ఏర్పాటు చేయడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్ది శ్రీనివాస్ యాదవ్, రాచకొండ కృష్ణ, కుంభం నాగరాజ్, చెంచాల నిఖిల్ నాయుడు, ప్రకాశ్, శ్యామ్, శివ, గౌస్, బషీర్, అజీమ్, నసిర్ పాల్గొన్నారు.