నల్లగొండ, జనవరి 20 : బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అలాగే బీఆర్ఎస్ దిమ్మెలను కూలగొట్టాలని పిలుపు ఇవ్వడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నాయకులు రెగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు.