భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 12 : యాదాద్రి జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కాలేజీని కుంటి సాకుతో సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు తరలించడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని మార్చుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని బాబు జగ్జీవన్‌రావ్ చౌరస్తాలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని ఇక్కడే నిర్మించాలన్నారు. జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను తరలించుకుపోవాలని ప్రయత్నిస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదని ఆరోపించారు. జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని ఇక్కడే ఉంచాలని కోరారు.