శాలిగౌరారం, జూలై 14 : సీఎం రేవంత్‌రెడ్డి నేటి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పర్యటన నేపథ్యంలో శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో పలువురి బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయగా గౌడ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వల్లాలలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని, కనీసం లబ్ధిదారుల లిస్ట్ కూడా తెలుపకుండా అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ వల్లాల గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ్లపెల్లి రవీందర్, మాదగోని నాగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించే హక్కు లేదా అన్నారు. గీత కార్మికులకు ఎక్స్‌గ్రేసియా విడుదల చేయాలని, కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేయాలని నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకుని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్ట్ అయిన వారిలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు కుంభం నర్సింహ్మాగౌడ్, గౌడ యువజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మల సురేశ్‌గౌడ్ ఉన్నారు.
Shaligouraram : శాలిగౌరారంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు