చండూరు, ఏప్రిల్ 27 : నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకలను సోమవారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లోని “జలదృశ్యం” వద్ద పార్టీ స్థాపించిన రోజు నుండి ఇవాళ్టికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రారంభించి, ఇది కేవలం వ్యక్తి పార్టీ కాకుండా, తెలంగాణ అంచనాలు నిధులు–నీళ్లు–నియామకాలు అనే చైతన్యం కలిగిన ప్రజా పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసి, దశాబ్దాల కలను 2014లో నిజం చేశారని, తెలంగాణకు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో మొదటగా తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసే వరకు అలుపెరగకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, మాదగోని వెంకటేశం, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్, కౌన్సిలర్లు కొండ్రెడ్డి మధు, బీఆర్టీయూ పట్టణ అధ్యక్షుడు చొప్పరి దశరథ, సర్పంచులు కొండ రజిత రవి, ఉజ్జిని ఉష అనిల్ రావు, నారపాక వసంత ధనయ్య, ఆలేటి యాదయ్య, దామెర రాములు, సుంకరి సత్తయ్య, చిలువేరు నరేష్, బేరి చంద్రశేఖర్, నందికొండ నర్సిరెడ్డి, గాలంక కృష్ణయ్య, మహమ్మద్ గౌస్, పల్లె నాగార్జున, కరుణాకర్ రెడ్డి, వెంకటయ్య, గండూరి జనార్ధన్, ఇరిగి రామన్న, ఇరిగి రామకృష్ణ, గురునాథం, వెంకటాచారి, జాల వెంకన్న, దోటి శీను, రాపోలు జగదీష్, బోడమోహన్, తందార రవి, భూతరాజు వెంకన్న పాల్గొన్నారు.