అర్వపల్లి, సెప్టెంబర్ 17 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ అర్వపల్లి మండల కార్యదర్శి జీడి సుందర్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. యూరియా దొరకక రైతులు చెప్పులను క్యూ లైన్ లో పెట్టే దుస్థితి వచ్చిందని తెలిపాడు. పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం, ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని, 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలు కాలేదని ఎద్దేవా చేశారు. వచ్చే స్థానిక సంస్థల పోరులో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.