పెన్పహాడ్, డిసెంబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వలపట్ల సైదమ్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు తులం బంగారం, రైతుబంధు, యువతులకు స్కూటీలు అందించకుండా దగా చేసిందని గుర్తు చేశారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని షాపుల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు యాళంలా జగన్, అశోక్ పాల్గొన్నారు.