రామన్నపేట, మే 1 : కేసీఆర్‌పై ఎన్ని నిషేధాలు విధించినా ఆయనను ప్రజల నుంచి విడదీయలేరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం ఉందని, భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు. జైళ్లు, కేసులు బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని, ప్రజల పక్షాన కొట్లాడుతాం, పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రైతన్నలు, ప్రజలు కరువుతో అల్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బడుగు, బలహీన వర్గాలకు ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించిదని, సమన్యాయం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. దేశంలో 40 కోట్ల మంది తిండి, బట్టలు లేక, 25 శాతం గ్రామాల్లో కరెంట్, రోడ్లు, విద్య లేక బాధపడుతుంటే బీజేపీ ప్రభుత్వం శ్రీరాముడు, పుల్వామా దాడులు అంటూ దేశాన్ని నాశనం చేస్తుందన్నారు. బడుగు వర్గాల బిడ్డనైన తనను గెలిపిస్తే మీ సేవకుడిగా పని చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి రైతులు, ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రైతుబంధు 5 ఎకరాలకే పరిమితం చేశారని, సౌభాగ్యలక్ష్మి, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు అన్నారే తప్ప అమలు చేశారా? అని ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, పార్టీ మండల కార్యదర్శి పోశబోయిన మల్లేశం, కంభంపాటి శ్రీనివాస్, బొక్క మాధవరెడ్డి, బందెల రాములు, ఎడ్ల మహేందర్‌రెడ్డి, అంతటి రమేశ్, ముక్కామల దుర్గయ్య, గొరిగె నర్సింహ, కాల్య శ్రవణ్‌కుమార్, మెట్టు మహేందర్‌రెడ్డి, బద్దుల రమేశ్, బత్తుల వెంకటేశం, పోతరాజు సాయి, జాడ సంతోష్, మిర్యాల మల్లేశం, బండ శ్రీనివాస్‌రెడ్డి, కూనూరు ముత్తయ్య పాల్గొన్నారు.