నల్లగొండ రూరల్, మే 19 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆదివారం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి నల్లగొండ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఎన్జీ కళాశాల, మేకల అభినవ్ అవుట్డోర్, ఇండోర్ స్టేడియంలలో వాకర్స్, క్రీడాకారులను కలిసి ఓటు అభ్యర్థించారు.
ఎన్జీ కళాశాలలో వాకింగ్ చేసే ప్రతి పట్టభద్రుడిని.. అవుట్డోర్, ఇండోర్ స్టేడియంలలో క్రీడాకారులను, స్విమ్మింగ్ ఫూల్ వద్ద చిన్నారుల తల్లిదండ్రులను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కటికం సత్తయ్యగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నాయకులు కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, యాట
జయప్రద ఉన్నారు.