నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధ్దంగా అమలు చేసి తీరాల్సిందేనంటూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్‌కు సర్వం సిద్ధమైం ది. బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపునకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో తెల్లవారుజాము నుం చే బంద్ చేసేందుకు బీసీ సంఘాల నేతలు సన్నద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాం గ్రెస్ సర్కార్ ఇచ్చిన జీవోపై హైకోర్టు ఈనెల 9వ తేదీన స్టే విధించిన విష యం తెలిసిందే. దీంతో చట్టబద్ధంగా కాకుండా కాంగ్రెస్ సర్కార్ కంటి తుడుపు చర్యగా ఇచ్చిన జీవోపై ఆది నుంచి అనుమానాలే ఉన్నాయి. చట్ట సవరణ జరగకుండా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అనుమానమే. అయినా కాంగ్రెస్ సర్కార్ జీవోతో చేతులు దులుపుకునేలా వ్యవహరించడంతో బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైకోర్టు స్టేకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు బీసీ సం ఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి.
బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బంద్‌కు నాలుగైదు రోజులుగా సన్నాహాలు జరిగాయి. బీసీ సంఘాల ఆధ్వర్యం లో బీఆర్ఎస్తో పాటు అన్ని రాజకీయ పార్టీ ల ముఖ్యనేతలు కలిసి స్వయంగా మద్దతు తెలిపాలని కోరారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించడమే కాకుం డా తాము స్వయంగా పాల్గొంటామని ముం దుకు వచ్చాయి. దీంతో తలపెట్టిన బంద్‌కు ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొననుండడంతో బంద్ కూడా విజయవంతం కానుంది. ఇప్పటికే నిర్వాహకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులను కలిసి బం ద్‌కు మద్దతు ప్రకటించాలని కోరారు. దీంతోపాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు, వాణిజ్య సముదాయాలను, షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులకు సైతం బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. దీం తోపాటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను విద్యార్థి సంఘా ల ఆధ్వర్యంలో విజ్ఙప్తి చేయగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందుగానే విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛంద బంద్‌కు ముందుకొచ్చి సెలవు ప్రకటించాయి. దీంతో శనివారం అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మూ తపడనున్నాయి. ఇక ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాల్లోనూ కార్యాకలాపాలు స్థంభించనున్నాయి. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం విధుల బహిష్కరణకు ముందుకు వ స్తున్నారు. దీంతో ప్రభుత్వ సంస్థలు తెరుచుకున్నా… పనులేవీ అయ్యే పరిస్థితి లేదు. ఇక సమయంలో అన్ని ప్రధాన రహదారులపై రాకపోకలను సైతం స్థంభింపచేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో రోడ్లపైన బైఠాయించి వాహనాలను అడ్డుకునే అవకాశాలు ఉన్నా యి. అందువల్ల మధ్యాహ్నం తర్వాతనే ఎవరైనా సరే ప్రయాణాలు పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు మద్దతుగా ప్రజలంతా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి సహకరించాలని ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.
బీసీ సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆది నుంచి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వవైఖరిని ఎండగడుతూనే ఉంది. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ల కోసం కే్ంర ద ప్రభుత్వంపై పోరాటం చేయకుండా రాష్ట్ర పరిధిలో తూతూమంత్రంగా జీవో పేరుతో ఆర్డినెన్స్ పేరుతో చేస్తున్న డ్రాపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడూ ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తుంది. చట్టసవరణ జరగకుండా జీవో ద్వారా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ మోసంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేసినట్లుగానే హైకోర్టులో సైతం 42శాతం బీసీ రిజర్వేషన్లపై స్టే విధించింది. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చినైట్లెంది. దీంతో బీసీ సంఘాలు తలపెట్టిన బంద్‌కు మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టేందుకు రంగంలోకి దిగింది. బంద్‌లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.
నేటి బంద్‌ను జయప్రదం చేయాలంటూ శుక్రవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా అం తటా ప్రధాన పట్టణాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బిజేపీ, సీపీఎం, సీపీఐ తదితర ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు సైతం పాల్గొన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానం నుంచి బంద్ సక్సెస్ కోసం మొదలైన సన్నాహక ర్యాలీ హైదరాబాద్ రోడ్డు, శివాజీనగర్, రామగిరి, క్లాక్‌టవర్, ప్రకాశం బజార్, అంబేద్కర్ విగ్రహం మీదు గా దేవరకొండ రోడ్డు వరకు సాగింది. బం ద్‌కు అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని, ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.