మోతె, మే 19: రైతుబంధు, యూరియా, రుణ మాఫీ, కొనుగోళ్లు, ఇలా అన్నీ ఎగొట్టి రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారని, ఇం దుకు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని, తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బొల్లం మల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు చివరికి పండిన పంటను అమ్ముకునే వరకూ అడుగడుగునా ఇబ్బందులే ఎదురువుతున్నాయని అన్నారు. కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితి లేదన్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మేం చాలా బాగా వడ్లు కొంటున్నం.. ఎవరికీ ఇబ్బంది లేదం టూ గొప్పలు చెప్పారు. కానీ అయ్యా ..ఉత్త మ్.. నేను ఏసీ రూములో కూర్చొని మాట్లాడ టం లేదు.. మీరు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దత్తత్త తీసుకున్న మోతె మండల కేంద్రంలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి గారూ.. గల్లీలకు వచ్చి రైతుల గోస వినండి.. మీ రేవంత్‌రెడ్డి పాలన ఎట్లా ఉందంటే.. ఢిల్లీకి నజరానా.. రైతులకు జరిమానా..అన్నట్లుగా తయారైంది. 69 సార్లు ఢిల్లీ వెళ్లి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోవాలని అన్నారు. తరుగు పెడితే తోలు తీస్తానన్న సీఎం ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం.. మీరు కొనడం చేతగాక అబద్ధాలు చెబుతున్నారు. రైతు భరోసా వారోత్సవాలంటూ సిగ్గులేకుండా సంబురాలు చేస్తున్నారు. విడతల వారీగా ఎకరాకు ఇంత చొప్పున విదిలించి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సంబురాలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు యా దవ్, లింగారెడ్డి, మిక్కిలి నేని సతీష్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, పగడాలరెడ్డి, ఇండ్ల వెంకటేశం, పల్స మల్సూర్, సర్పంచులు, కోడి లింగయ్య, కుక్కల భిక్షం, సుప్రజ, శ్రీను, మూడు నగేశ్, వెంకన్న, గాంధీ, పాషా, తదితరులు పాల్గొన్నారు.