కోదాడ, జూలై 09 : కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిరక్షరాస్యులు సాంకేతిక అవగాహన లేని ఉన్నవారే ఎక్కువగా ఉన్నందున ఓట్ల నమోదు ప్రక్రియ బాధ్యత బీఎల్ఓలే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ ఆర్డీఓను. గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్ఓలు సర్ ఫారాలను పంపిణీ చేయడం వల్ల ప్రయోజనం లేదని, వారే ఇంటింటికి తిరిగి ఓట్లు నమోదు చేయాలన్నారు. కొంతమంది బీఎల్ఓలు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని అందువల్ల ఓటర్లకు ఫారాలు అందడం లేదన్నారు.
ఫారాలలోని సాంకేతిక అంశాలు చదువుకున్న వారికి అర్థం కాని పరిస్థితిలో నిరక్షరాస్యులు ఎలా నింపుతారన్నారు. ఈ దుష్పరిణామాల వల్ల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందన్నారు. ఈ గందరగోళాన్ని అధిగమించేందుకు బీఎల్ఓలే ఇంటింటికి తిరిగి ఫారాలను సజావుగా నింపి ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగించేందుకు ఆర్డీఓ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా బాబా, ఉపేందర్ గౌడ్, నాగుల్ మీరా, చలిగంటి వెంకట్, ఇతర నాయకులు పాల్గొన్నారు.