నకిరేకల్, జూలై 18 : ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నోముల శంకర్‌యాదవ్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ సెంటర్లో శుక్రవారం పెద్దఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా యువకులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు గాదె శివ, నోముల శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెలుగులతో నింపిన సూర్యుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన భగీరథుడు జగదీశ్‌రెడ్డి అని కొనియాడారు.
ప్రత్యేకంగా నకిరేకల్ నియోజకవర్గానికి పదేండ్లలో మున్సిపాలిటీ ఏర్పాటు, వంద పడకల ఆస్పత్రి, పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, నిమ్మకాయల మార్కెట్, జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు, బ్రాహ్మణ వెల్లంల, అయిటిపాముల లిఫ్ట్ ప్రాజెక్ట్‌లపై చొరవ చూపుతూ నియోజకవర్గానికి సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, సోషల్ మీడియా నాయకుడు మెండె సురేశ్‌యాదవ్, బీఆర్ఎస్వీ నాయకులు వంటల చేతన్, సాయి కళ్యాణ్, జిల్లా సంపత్, మట్టిపల్లి నాగరాజు యాదవ్, ముక్కాముల శ్రీను, గజ్జి నాని యాదవ్, చింతమల్ల వెంకటేశ్, మండలం సతీశ్, గజ్జి నాగరాజు, కందికంటి నాగబాబు, శింగరి శివకుమార్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.