నల్లగొండ విద్యావిభాగం (రామగిరి), జూన్ 13 : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల్ రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. రక్తదాన ప్రాముఖ్యతను వివరించారు. రక్తాన్ని దానం చేయండి.. ప్రపంచ మానవుల ప్రాణాలను నిలబెట్టండి అని పిలపునిచ్చారు.
సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి పసుపుల, వివిధ విభాగ అధిపతులు డా.రూప, డా.తిరుమల, డా.సత్తిరెడ్డి, డా.మాధురి, ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ అధికారి డాక్టర్ మశ్చేంద్ర, ప్రిన్సిపాల్ సుధారాణి పాల్గొన్నారు.
Nalgonda : ఎంజీయూలో విద్యార్థుల రక్తదానం