నల్లగొండ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మద్దెల ప్రేమయ్య, మల్లయ్య, చంద్రయ్యతో పాటు 50 మంది నాయకులు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి పక్షాలకు స్థానం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో వెల్లువలా చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.