సూర్యాపేటటౌన్, జూన్ 2 : కేసీఆర్ కృషి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ పతాకాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజ ల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్ 2001లో బీఆర్ఎస్ను స్థాపించారని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించుకున్న రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, అంబేద్కర్ ఆశయాలను అమలు చేసిన గొప్ప నా యకుడని కొనియాడారు. సాగునీరు, తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, నిరుపేద విద్యార్థులకు గురుకులాలను ఏర్పాటు చేసి బడుగు, బలహీన, సబ్బండ వర్గాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించి తెలంగాణను రోల్ మోడల్ చేశారని గుర్తు చేశారు.
నేడు అధికారంలో ఉన్న సీఎం, మంత్రుల పదవులను కేసీఆర్ ఇచ్చినవనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అమలుకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. సీఎం, మంత్రులు దోచుకు నే పనిలో ఉన్నారని, కమిషన్లు లేనిదే పను లు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో గోపగాని వెంకటనారాయణ గౌడ్, నిమ్మల శ్రీనివాస్, పెరుమాళ్ల అన్నపూర్ణ, నెమ్మాది భిక్షం, జీడీ భిక్షం, తూడి నర్సింహారావు, చింతలపాటి భరత్ మహాజన్, గండూరి కృపాకర్, సుంకరి రమేశ్, ఎస్కేరఫీ, సయ్యద్ సలీం, లవకుశ, కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్నగౌడ్, దేవత్ కిషన్, మద్దెల వీరస్వామిలతోపాటు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.