రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముతరు.. బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి
చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, మళ్లీ కాంగ్రెస్ చేతిలోకి అధికారం పోతే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని
పేర్కొన్నారు. అసెంబ్లీ టికెట్లు అమ్ముకునే రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముతాడని
విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ
రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.
ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 30 : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్ముతారని, బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరులో జరిగిన సీఎం ఆశీర్వాద బహిరంగ సభను విజయవంతం చేసినందుకు బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని, మోసపొవొద్దని సూచించారు.
కర్ణాటకలో రైతులకు రోజుకు 5గంటల విద్యుత్‌ను మాత్రమే ఇస్తున్నామని స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పడంతోనే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, మళ్లీ కాంగ్రెస్ చేతిలోకి అధికారం వెళ్తే నాశనం చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకునే రేవంత్‌రెడ్డి.. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతాడని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రొకర్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టర్ల కోసం బీజేపీకి అమ్ముడుపోయాడని దుమ్ముత్తిపోసిన రేవంత్‌రెడ్డి తిరిగి మునుగోడు కాంగ్రెస్ టికెట్‌ను ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆలేరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో చాలా బాగుందని ప్రజలందరూ హర్షిస్తూ గ్రామగ్రామాన కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, పూర్ణచందర్‌రాజు, యాస ఇంద్రారెడ్డి, బాషబొయిన ఉప్పలయ్య, కోరె భిక్షపతి, మండల సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశ్‌గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు లగ్గాని రమేశ్‌గౌడ్, ఎంపీటీసీ యాస కవిత, కోరటికల్ సర్పంచ్ సత్తయ్యగౌడ్, మాజీ సర్పంచ్ యాదగిరిగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బూడిద రాములుగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు కోరె వెంకన్న, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.