నల్లగొండ సిటీ ఏప్రిల్ 2: విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వారికి సంఘీ భావంగా ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో హమీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
కార్మికులు ఐక్యమత్యంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. కార్మికులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
సూర్యాపేట, ఏప్రిల్ 2: ఒకే సంస్థలో ఒకే రూల్ అమలు చేసి ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్జిజన్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గణేష్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్జిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్ని మార్లు విన్నవించినా ప్రభు త్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎస్ ఈ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున వంటవార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పని చేస్తున్న అందరికీ ఎపీఎస్ఇబీ సర్వీసు రూల్స్ అమలుచేయాలన్నారు.
బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అన్ని ట్రేడ్ యూనియన్లు, టీవీఏఈ జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్జిజన్ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ తిరుపయ్య, నర్సింహాచార్యులు, కొండా నకులుడు, వీరభద్రం, పబ్బు మల్లయ్య, నాగమణి, దీప్తి, శ్రీధర్‌రెడ్డి, నాగరాజు, వెంకన్న పాల్గొన్నారు.