కోదాడ, జులై 14 : ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తిసిన కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో అరెస్టులు చేయిస్తుందని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్లిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ముఖ్యమంత్రి సభకు వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టడం లేదని చెప్పినప్పటికి ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కర్ల సుందర్బాబు, సంగిశెట్టి గోపాల్, పిట్టల భాగ్యమ్మ, మేదర లలిత, దొంగల శ్రీనివాస్, చింతల లింగయ్య, కాసాని మల్లయ్యగౌడ్, గొర్రె రాజేష్, వేముల వీరబాబు, నరమనేని శ్రీను, మామిడి రంగారావు, ఉపేందర్గౌడ్ ఉన్నారు.