Beer | ఓ యువకుడు శనివారం కావడంతో వీకెండ్‌ను చల్లటి బీర్‌తో ఫుల్ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. ఇంకేంటి వెంటనే కోదాడ పట్టణం స్థానిక గుడిబండ రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. బార్లో కింగ్ ఫిషర్ బీరు కొనుగోలు చేశాడు. అయితే యువకుడికి ఆ బీరులో నలకలు, పాకురు ఉండటం చూసి నివ్వెర పోయాడు.
వెంటనే సదరు యువకుడు ఆ బార్ యజమానితో ఇదేమిటని అడగగా.. బీరు మేమేమన్నా తయారు చేస్తున్నామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు యజమాని. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో కోదాడలో డేటు దాటిన బీర్లు అమ్మకాలు సాగుతున్నాయని తక్షణమే విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ సంఘటన శనివారం రాత్రి కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది.