మునుగోడు మార్చి 23 : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళా రైతులు ధరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ ఆర్.సీ జిరాక్స్ (ట్రాక్టర్ సంబందిత పనిముట్లకు మాత్రమే), పాస్ పోర్టు సైజ్ ఫోటో తో ఈనెల 26 లోపు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. పట్టాదారు పాసు బుక్ మహిళా రైతుల పేరు మీదనే ఉండాలని ఆమె తెలిపారు.
ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డి.డి రూపంలో చెల్లించాలని తెలిపారు. ఈ పథకం మహిళా రైతులకు మాత్రమే వర్తిస్తుందని ఈ విషయాన్ని రైతులందరూ గమనించ గలరని కోరారు.
కేటగిరి వారీగా అందుబాటులోఉన్న పనిముట్ల వివరాలు
1. బ్యాటరీ/చేతి పంపు స్ప్రేయర్ జనరల్-6 , ఎస్సీ-2
2. పవర్ నాప్ సాక్ స్ప్రేయర్ జనరల్-6 ,ఎస్సీ-1
3. రోటవేటర్ జనరల్-4,ఎస్సీ-1
4. సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ జనరల్-1 , ఎస్సీ-1
5. డిస్క్ హరో/కల్టివేటర్/ఎమ్ బి నాగలి/ కేజ్ వీల్స్/రోటో పడ్లర్ జనరల్-4 , ఎస్సీ-1
6. బండ్ ఫార్మర్ (నాన్ పి.టి.వో)జనరల్-1
7. బండ్ ఫార్మర్ ( పి.టి.వో)జనరల్-1
8. పవర్ టిల్లర్ జనరల్-1
9. స్ట్రా బేలర్ ఎస్సీ-1