రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా విజయం నల్లేరుపై నడకేనని, బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే పట్టం కట్టేందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 14, 16 వార్డుల్లో ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. వాడవాడలా తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. పట్టణాభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
– సూర్యాపేట టౌన్, జూలై 23
సూర్యాపేట టౌన్, జూలై 23 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ ఖరారైనట్లేనని, రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా విజయం నల్లేరుపై నడకేనని, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే పట్టం కట్టేందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 14, 16 వార్డుల్లో ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి వాడవాడలా కలియతీరుగుతూ ప్రజలతో మమేకమై ఇంకా మిగిలి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముచ్చటించారు. అనంతరం స్థానిక మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మే పరిస్థితి లేదని, ఓటర్లంతా ఇప్పటికే డిసైడ్ అయ్యిండ్రని తెలిపారు. తొమ్మిదేండ్ల అభివృద్ధి పాలనపై అంతా హర్షం వ్యక్తం చేస్తూ అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో అన్ని ప్రాంతాల రూపురేఖలు మారి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న అభివృద్ధి పాలనతో యావత్ ప్రజానీకం గులాబీ జెండా వెంటే ఉన్నారన్నారు. వార్డుల్లో సందర్శిస్తున్న సమయంలో ప్రజలంతా కారు గుర్తుకే ఓటేస్తామని ముక్తకంఠంతో చెప్తుండడం మరింత ఆనందాన్నిస్తుందన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో సూర్యాపేట రూపురేఖలు మార్చుకున్నామని, ఇదే ఉత్సాహంతో మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందామన్నారు. పట్టణాభివృద్ధికి మరో 30 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
వీటితో మిగిలిన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుందామని చెప్పారు. పట్టణంలో మునుపెన్నడూ జరుగని విధంగా ఇప్పటికే 1390 కోట్లతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నట్లు తెలిపారు. 2014కు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారి నలుదిక్కులా సరికొత్త అందాలతో యావత్ రాష్ర్టానికే ఆదర్శంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఒక వైపు కలెక్టరేట్, మరోవైపు ఎస్పీ కార్యాలయం, జాతీయ రహదారి సమీపంలో అద్భుతంగా రూపుదిద్దుకున్న మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్, గిరిజన గురుకుల పాఠశాలలు అద్భుతంగా దర్శనమిస్తున్నాయన్నారు. అంతేకాకుండా పార్కులను తలపించేలా మహా ప్రస్తానం, రెండు మినీ ట్యాంక్బండ్లు, రోడ్ల విస్తరణతో విస్తారంగా మారిన వీధులు, మినీ ట్యాంక్‌బండ్‌లో బోటింగ్, ఆహ్లాదకరంగా పార్కులు, వాడవాడలా పచ్చదనం సంతరించుకున్న హరితహారం మొక్కలు, వెలుగుల జిలుగుల సెంట్రల్ లైటింగ్‌తో సూర్యాపేట అందాలు చూడతరమా అన్న చందంగా పట్టణం సుందరంగా రూపుదిద్దుకుందన్నారు. రాబోయే రోజుల్లోనూ ఐక్యతతో మరింత అభివృద్ధితో ముందుకు సాగుదామన్నారు. ఆయా వార్డుల్లో మంత్రి సందర్శిస్తున్న సమయంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై జగదీషన్న అంటూ నినాదాలతో సందడి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, మారిపెద్డి శ్రీనివాస్‌గౌడ్, రంగినేని ఉపేందర్‌రావు, గుండపునేని కిరణ్, కాస శ్రీనివాస్, జాకీర్ పాల్గొన్నారు.