కట్టంగూర్, ఏప్రిల్ 30 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో 12 ఉన్నత, 2 గురుకుల, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు మొత్తం 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 446 మంది విద్యార్థులు పాసై 96.33 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. అత్యధికంగా చిన్నపురి (చందుపట్ల) బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అంజలి 545 మార్కులు, కట్టంగూర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని తేజశ్రీ 535 మార్కులు, ఈదులూరు ఉన్నత పాఠశాలకు చెందిన సరస్వతి 516 మార్కులు, కట్టంగూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బావాని 510 మార్కులు సాధించినట్లు ఎంఈఓ అంటి అంజయ్య తెలిపారు.