తుంగతుర్తి, జూలై 30 : తుంగతుర్తి మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీకి చెందిన కత్తుల నవ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తడకమళ్ల రవికుమార్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి సురేష్, కొండగడుపుల వెంకటేష్, బొంకూరి మధు, తడకమళ్ల మల్లికార్జన్, కాసార్ల రాజశేఖర్, బొంకూరి బాలకృష్ణ, బొంకూరి సాయి, బొంకూరి రాజు, బొంకూరి శివ, కాసార్ల పవన్, బొంకూరి వెంకన్న పాల్గొన్నారు.