మిర్యాలగూడ, మే 7 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఆదివారం మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామ సర్పంచ్ శ్రీశైలం(కాంగ్రెస్ పార్టీ), నలుగురు వార్డు సభ్యులు, 300 కాంగ్రెస్ కార్యకర్తలు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర్రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే ఎజెండాగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గత 9 ఏండ్లుగా రాష్ట్రంలోని రైతులు, కూలీలు ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆయనకు ప్రజలంతా అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో మాడుగులపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, పోకల రాజు, జేరిపోతుల రాములుగౌడ్, అల్గుబెల్లి గోవిందరెడ్డి, కోటిరెడ్డి, మారుతి వెంకట్రెడ్డి, యాతం కళింగారెడ్డి పాల్గొన్నారు.