BRS | సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి 25 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. తమ బతుకులు మార్చిన అభివృద్ధి పార్టీ బీఆర్ఎస్వైపే తమ పయనమని నిర్ణయించుకుని 25 కుటుంబాల సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ 25 కుటుంబాలతో మరో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరారు.