ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 22: తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని, ఆ ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మాజీ మం త్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామ సర్పంచ్ జటంగి గణితారామనర్సయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా జగదీశ్‌రెడ్డి నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రా పాలనలో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని, కేసీఆర్ హయాంలో పదేండ్లు ఎనలేని అభివృద్ధి సాధించాయన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి పది తెలంగాణ గ్రామాలే అన్నారు. మొదటి 20 గ్రామాల వారీగా చూసినా 19 స్థానాల ను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయన్నారు. అంతటి ఘన చరిత్ర కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందన్నారు. పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెంచుకున్నామన్నారు. వాటి సంరక్షణకై ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామని, మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా మంచినీటి సమ స్యను పరిష్కరించామన్నారు. గ్రామానికో ట్రాక్టర్, వైకుంఠధామాలు, రోడ్లు ఇలా గ్రా మానికి కావాల్సిన వసతులు కల్పించామన్నా రు. ఇన్ని సౌకర్యాలున్న గ్రామాలు దేశంలో మరెక్కడా లేవన్నారు.
అందుకే మన తెలంగాణ గ్రామాలు అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిచాయని మజీమంత్రి పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, గ్రామాలను ఐక్యమత్యంతో అభివృద్ధి చేసుకోవాలన్నారు. నూ తనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు వార్డు సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రియాంక, కార్యదర్శి దీప్తి, పార్టీ మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, ముద్దం మధుసూదన్‌రెడ్డి, బెల్లంకొండ యాదగిరి, మాజీ ఎంపీటీసీ యడవెల్లి ముత్తయ్య, మాజీ ఉప సర్పం చ్ ముత్తయ్య, బొల్లెపాక సైదులు, ఆడెపు మహేశ్, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.