సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 6 : దేశంలోనే గొప్ప పథకం దళితబంధు అని, దళితుల ఆర్థిక బలోపేతానికే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారంమండలంలోని రామన్నగూడెంలో దళితబంధు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి మొదటి విడుత యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. యూనిట్లు అందుకున్న లబ్ధిదారులు ఆర్థిక వనరులను పెంచుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సుమారు 1200 గురుకులపాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు రైతాంగాన్ని ఆదుకొని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.
ఈ సందర్భంగా 7 ట్రాక్టర్లు, 6 మినీవ్యాన్లు, 5 కార్లు, 2 వరికోత మిషన్లను 24 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి వాహనాలను నడిపి లబ్ధిదారులను ఆనందపరిచారు. లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో కలిసి
కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, దళితబంధు ప్రత్యేకాధికారి శ్రీధర్, తాసీల్దార్ వెంకన్న, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ కత్తుల మల్లయ్య, ఎంపీటీసీ ఉప్పల లక్ష్మమ్మ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గౌని లక్ష్మణ్