e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

కుత్బుల్లాపూర్‌,జూలై24: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్ల లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. 443 మంది లబ్ధిదారులకు రూ.4,43,51,388 విలువగల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కేఎం గౌరీశ్‌, బొడ్డు వెంకటేశ్వర్‌రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం

దుండిగల్‌,జూలై24: నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 7వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డిలు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ గోపి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ మెంబర్లు, పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana