హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్సీ చదివిన వారు సింథటిక్ కెమిస్ట్రీ, కెమికల్ బయాలజీ, బయోఫిజికల్ కెమిస్ట్రీ, సర్ఫేస్ అండ్ ఇంటర్‌ఫేషియల్ కెమిస్ట్రీ, థిరీటికల్ అండ్ కంప్యూటేషనల్ కెమిస్ట్రీతోపాటు, బయోఫిజిక్స్, లేజర్ ఫిజిక్స్, ఫొటోనిక్స్, సాఫ్ట్ అండ్ యాక్టివ్ మ్యాటర్, మెటీరియల్ ఫిజిక్స్ వంటి అంశాల్లో పీహెచ్డీ పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. ఫిజిక్స్‌లో పీహెచ్డీ దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈ నెల 30 కాగా, మే 10 లోపు కెమిస్ట్రీలో దరఖాస్తు చేసుకునే వీలుంది.