GT vs RCB : క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) రికార్డు స్కోర్ కొట్టింది. విరాట్ కోహ్లీ(43), పడిక్కల్(30)లు అదిరే ఆరంభమివ్వగా.. కెప్టెన్ రజత్ పటిదార్(93 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ బౌలర్లను భయపెట్టాడు. సిక్సర్లతో విరుచుకుపడిన ఆర్సీబీ సారథి.. డెత్ ఓవర్లలో భీకరంగా ఆడడంతో ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ నెలకొల్పిన అత్యధిక స్కోర్(233)ను బెంగళూరు దాటేసింది. రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తేనే శుభ్‌మన్ గిల్ సేన ఫైనల్ చేరనుంది. లేదంటే క్వాలిఫయర్ 2 ఆడాల్సి వస్తుంది.
ధర్మశాల మైదానంలో ఆర్సీబీ బ్యాటర్లు వీరకొట్టుడుతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు దడపుట్టించారు. క్వాలిఫయర్ 1లో విరాట్ కోహ్లీ(43) మెరవగా.. కెప్టెన్ రజత్ పటిదార్(93 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(19)ను ఔట్ చేసిన రబడ(2-54).. గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. 21 పరుగుల వద్దే తొలి వికెట్ పడినా పడిక్కల్(30), కోహ్లీలు స్కోర్ వేగం తగ్గకుండా చూసుకున్నారు.
𝗧𝗵𝗲 𝗯𝗶𝗴 𝗺𝗮𝘁𝗰𝗵 𝗽𝗹𝗮𝘆𝗲𝗿 steps up in #Qualifier1 🤩
Rajat Patidar with a quickfire 21-ball fifty ❤️👏
Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/yvGSmwn8GA
— IndianPremierLeague (@IPL) May 26, 2026
రబడను ఒత్తిడికి గురి చేస్తూ నాలుగో ఓవర్లో కోహ్లీ ఒక ఫోర్, పడిక్కల్ మూడు బౌండరీలతో ఆర్సీబీ స్కోర్ యాభైకి చేరింది. ఆరో ఓవర్లోనూ విరాట్ రెండు ఫోర్లు, సిక్సర్‌తో రెచ్చిపోగా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఆర్సీబీ 76 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీని ఔట్ చేసి ఈ ద్వయాన్ని హోల్డర్ విడదీశాడు. రెండో బంతికి కోహ్లీ బౌల్డవ్వగా.. నాలుగో బంతిని ఆడిన పడిక్కల్ వికెట్ కీపర్ బట్లర్ చేతికి చిక్కాడు. అనంతరం కృనాల్ పాండ్యా జతగా కెప్టెన్ పటిదార్ ఇన్నింగ్స్ నిర్మించాడు.
టాప్ గేర్‌లో ఆడిన పటిదార్ గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఖేజ్రోలియా వేసిన 15వ ఓవర్లో రెండు నో బాల్స్, వైడ్, నాలుగు ఫోర్లు, సిక్సర్ కలిపి 28 రన్స్ వచ్చాయి. మూడో వికెట్‌కు 95 రన్స్ జోడించిన కృనాల్‌ను రబడ ఔట్ చేయగా గుజరాత్ ఊపిరిపీల్చుకుంది. కానీ, పటిదార్ రెండు సిక్సర్లతో స్కోర్ రెండొందలు దాటించాడు. అంతేనా.. ప్రసిధ్ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. గుజరాత్ చెత్త ఫీల్డింగ్ కూడా కలిసి రావడంతో ఆర్సీబీ నాకౌట్లో అత్యధిక స్కోర్‌తో చరిత్ర సృష్టించింది. 2023లో ముంబై ఇండియన్స్‌పై 233/3తో గుజరాత్ సాధించిన రికార్డును బెంగళూరు బద్ధలు కొట్టింది.
Going, going, GONE! 🚀
🎥 Rajat Patidar and Jitesh Sharma providing the big final flourish 🔥
Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets pic.twitter.com/ileDqVAcsu
— IndianPremierLeague (@IPL) May 26, 2026