మేడ్చల్, మార్చి25(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వెనుకబడిన సంక్షేమశాఖ కార్యాలయాన్ని గురువారం వెనుకబడిన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెనుకబడిన సంక్షేమ శాఖలో అమలవుతున్న వివిధ పథకాల తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీసీ స్కాల ర్ షిప్, కల్యాణలక్ష్మి, మహాత్మాజ్యోతిరావు పూలే ఓవర్సిస్ విద్యానిధిలపై ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులతో సమీక్షించారు. ఈసమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి టీ.ఝాన్సీ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి వినోద్ ఇతర అధికారులు విజయకుమారి, చత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.