సోమవారం 18 జనవరి 2021
Medchal - Nov 27, 2020 , 05:55:11

భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తి

భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తి

మేడ్చల్‌ కలెక్టరేట్‌ : భారత రాజ్యాంగాన్ని గౌరవించడం అందరి బాధ్యత అని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌ అన్నారు. గురువారం 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం లభించగా 1950 నవంబర్‌ 26 నుంచి అమలులోకి వచ్చిందన్నారు.  దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం ఎన్నో హక్కులు, బాధ్యతలను కల్పించిందని తెలిపారు. ప్రపంచంలోనే  అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, దీనిని రచించి దేశానికి అందజేసిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌తో పాటు వారి బృందాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, డీఆర్‌ఓ లింగ్యా నాయక్‌, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.