నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు | నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా మధ్యంతర ఎన్నికల తేదీలను ప్రకటించారు.

ఖాట్మాండు : నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా మధ్యంతర ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు షేక్ బహదూర్ దేవ్బా, కేపీ శర్మ ఓలి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షురాలి కార్యాలయం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చేశారని, మొదటి సాధారణ ఎన్నికలు నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19న నిర్వహించాలని ఆదేశించినట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ బలనిరూపణకు వెనక్కి తగ్గగా, రాష్ట్రపతి విద్యాదేవి భండారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో తమకు 149 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విపక్ష కూటమి ముందుకు వచ్చింది. అయితే, విపక్ష అభ్యర్థనను అధ్యక్షురాలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నేపాల్ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్నది. రోజుకు సగటున 8వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
ఆన్లైన్ పాఠాలు బాగు
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

